Rabi Paddy Procurement : రైతులకి పండగలాంటి వార్త… 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ..
Rabi Paddy Procurement : రైతులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 24 గంటల్లోగా రైతుల ఖాతాలో నిధులు జమ చేయనున్నారు.
ap minister nadendla manohar said rabi paddy procurement amount deposited farmers accounts within 24 hours
- రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ధాన్యం సేకరించిన 24 గంటల్లోగా
- ఖాతాలో డబ్బులు జమ
Rabi Paddy Procurement : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ ధాన్యం సేకరణపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రారంభం అయ్యిందని.. ఖరీఫ్ సీజన్ మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి పొరపాట్లు, అక్రమాలకు తావు లేకుండా రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రబీ సీజన్ ధాన్యం సేకరణకు ఇప్పటికే సర్వం సిద్ధమయ్యిందన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు.
ఈసారి రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే.. దానికి సంబంధించిన డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని.. దీనికి సంబంధించి మొత్తం రూ.11,300 కోట్లను.. 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇక మరో రూ.7,300 కోట్లను కేవలం 8 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో వేశామని తెలిపారు.
రబీలో 19.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించామన్నారు. అలానే 2.01 లక్షల మంది రైతుల ఖాతాల్లో 48 గంటల వ్యవధిలోనే రూ.4,575 కోట్లను జమ చేశామన్నారు. ధాన్యం సేకరణలో గతంలో జరిగిన పొరపాట్లను గుర్తించి.. ఈసారి అవి మళ్లీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
అలానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బకాయిలను కూడా చెల్లించిందని తెలిపారు. ఖరీఫ్‌లో 48.70 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని, రాష్ట్ర విభజన తర్వాత ఇదే అత్యధికమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి 2022-23 సంవత్సరంలో 35.36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా.. రైతులకు రూ.7,222 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. ఇక 2023-24లో 29.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని.. అలానే 2024-25లో 35.95 లక్షల మెట్రిక్ టన్నులు, 2025-26లో 48.70 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు.
