Minister Roja : పిటీ ఉషా ఆ విధంగా మాట్లాడటం బాధాకరం : మంత్రి రోజా

క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించామని పేర్కొన్నారు. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వస్టెర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నామని తెలిపారు.

Minister Roja : ఏపీ నుంచి అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ కావాలనే ప్రపోజల్ రాలేదని పిటీ ఉషా ఎలా అన్నారో తెలియదని మంత్రి రోజా అన్నారు. పిటీ ఉష తొలిసారి ఏపీకి వచ్చారని తెలిపారు. పిటీ ఉషా ఆ విధంగా వ్యాఖ్యానించడం బాధ కలిగించిందన్నారు. సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ గురించి తనకు చెబితే డిస్కస్ చేసేదాన్ని అని పేర్కొన్నారు. మంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా క్రీడా, టూరిజం, సాంస్కృతిక శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో ఫంక్షన్లు, ఈవెంట్స్ జరిగాయని తెలిపారు.

ఎన్నో ప్రసిద్ధ దేవాలయాల్లో ప్రసాద స్కీంను రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఆవిష్కరించామని చెప్పారు. క్రీడా, కళా రంగాల్లో ఉన్న వాళ్లని గుర్తించామని పేర్కొన్నారు. సాంస్కృతిక రంగంలో తొలిసారిగా పోటీలు పెట్టామని వెల్లడించారు. గ్లోబల్ ఇన్వస్టెర్స్ సమ్మిట్, జీ-20 సదస్సులో కళాకారుల సేవలు తీసుకున్నామని తెలిపారు. జగనన్న బ్రాండ్ ఎలా ఉంటుందో గ్లోబల్ ఇన్వెస్టెర్స్ సమ్మిట్ ద్వారా అర్థమైందన్నారు. అదానీ, అంబానీ, దాల్మియా వంటి వారు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించారని తెలిపారు.

Minister Roja: చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్

జీఐఎస్ సమ్మిట్లో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని పేర్కొన్నారు. 125 ఎంఓయూల్లో 45 డీపీఆర్ లు సబ్మిట్ చేశామని చెప్పారు. త్వరలోనే పనులు మొదలు కానున్నాయని తెలిపారు. శిల్పారామాలకు 13 లక్షల మంది పర్యాటకులు వచ్చారని వెల్లడించారు. జగన్…యూత్ ఐకాన్ అని అభిర్ణించారు. డ్రగ్స్, ఈవ్ టీజింగ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, కాలేజీల్లో సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు.

2023ని ఇయర్ విజిట్ ఏపీగా ప్రకటించామని చెప్పారు. త్వరలో ఒబెరాయ్ హోటళ్లు భూమి పూజ జరుగబోతుందని పేర్కొన్నారు. గండికోట, పిచ్చుల్లంక, తిరుపతి, విశాఖ వంటి ప్రదేశాల్లో హోటళ్ల నిర్మాణం జరగబోతుందని చెప్పారు. కూచిపూడి ఖ్యాతిని మరింత వ్యాప్తి చేశామని చెప్పారు. క్రీడా రంగంలో టెన్నిస్ కోసం అకాడమీల ఏర్పాటుకి స్థలాలు ఇచ్చామని గుర్తు చేశారు. టెంపుల్ టూరిజం వల్ల ఏపీ మూడో స్ఖానానికి వెళ్లిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు