AP Municipal Elections Live updates: కుప్పంలో దొంగ ఓట్లు.. చంద్రబాబు సీరియస్..!

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

AP Municipal Elections Live updates: కుప్పంలో దొంగ ఓట్లు.. చంద్రబాబు సీరియస్..!

Ap Polling

Updated On : November 15, 2021 / 8:06 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలోని నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, గురజాల, దాచేపల్లి, దర్శి, బేతంచెర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. వీటితో పాటు రాష్ట్రంలోని మరో 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లకు ఎన్నిక నిర్వహిస్తున్నారు. 17న ఫలితాలు వెల్లడిస్తారు. పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో సున్నితమైన కేంద్రాలకు భారీగా పోలీసు బలగాలను తరలించారు.