Balineni : తగ్గేదేలే అంటున్న బాలినేని.. రాజీనామ దిశగా అన్నారాంబాబు ?

విజయవాడలోని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అనుచరుల ఆందోళన చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలినేనిని...

Balineni Srinivasa Reddy Followers : మంత్రి పదవి ఆశించి నిరాశకు గురైన బాలినేని శ్రీనివాసరెడ్డి తగ్గేదే లేదంటున్నారు. తీవ్ర అసంతృప్తిలో ఉన్న బాలినేనికి సజ్జల రామకృష్ణారెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆయన మాత్రం మెత్తబడలేదు. దీంతో బాలినేని నివాసం నుంచి నిరాశగా వెళ్లిపోయారు సజ్జల. జగన్‌ కేబినెట్‌లో బాలినేనికి చోటు దక్కలేదన్న సమాచారంతో ఆయన నివాసానికి పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. విజయవాడలోని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద అనుచరుల ఆందోళన చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. బాలినేనిని మంత్రివర్గంలో కొనసాగించాలని అనుచరులు నినాదాలతో హోరెత్తించారు.

Read More : Jagan Cabinet 2.0 : కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం.. మహిళకే హోంమంత్రి పదవి ?

ఈ క్రమంలో బాలినేని అనుచరుల్లో కొంతమంది సజ్జలతో మాట్లాడేందుకు ప్రయత్నించడంతో ఆయన ఫైరయ్యారు. బాలినేని అనుచరులపై మండిపడ్డారు. అంతేకాదు మీడియాతోనూ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. సజ్జలతో పాటు శ్రీకాంత్‌రెడ్డి కూడా బాలినేనిని బుజ్జగించేందుకు ప్రయత్నించినా.. ఆయన ససేమిరా అన్నారు. సీఎం జగన్‌ తొలుత విడుదల చేసిన కేబినెట్‌ జాబితాలో ప్రకాశం జిల్లాకు మంత్రి పదవి కేటాయించలేదు. అక్కడ మాజీ మంత్రులు బాలినేని.. ఆదిమూలపు సురేశ్ ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే, సామాజిక సమీకరణాలతో సురేశ్‌ను కొనసాగించి.. బాలినేనికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని సీఎం డిసైడ్ అయ్యారు. కానీ బాలినేని మాత్రం ఇద్దరినీ తప్పించాలని.. లేకపోతే ఇద్దర్నీ కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

Read More : AP Cabinet : అంబటికి దక్కిన మంత్రి పదవి.. రాజకీయ ప్రొఫైల్

అయితే సీఎం మాత్రం సురేశ్‌ను మంత్రిగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో.. బాలినేని అలకబూనారు. ఆదివారం ఉదయం నుంచి విజయవాడలోని ఇంటికే పరిమితమయ్యారు. దీంతో బాలినేని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలినేనికి మద్దతుగా గిద్దలూరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు అన్నారాంబాబు. ఇవాళ బాలినేనితో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఒంగోలు మేయర్‌తో సహా కార్పొరేటర్లంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది.

Read More : Mekathoti Sucharitha Resign : వైసీపీలో కేబినెట్ చిచ్చు.. ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా

మొత్తం 25మంది మంత్రులతో సీఎం జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ రెడీ చేశారు. 11 మంది పాత మంత్రులు, 14 మంది కొత్త వారితో కొత్త కేబినెట్ కూర్పు చేశారు. ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్ నాథ్, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజిని, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, అంజద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరామ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కె.నారాయణ స్వామి, రోజా, ఉషశ్రీ చరణ్ లకు మంత్రి పదవులు దక్కాయి.  ఈ మంత్రులంతా 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం ఉదయం 11.31 నిమిషాలకు గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు