AP Corona Cases : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(425)తో పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు.

Ap Corona Cases

AP Corona Cases : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 335 కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజు(425)తో పోలిస్తే కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు.

ఒక్కరోజు వ్యవధిలో 936మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 19వేల 241 కరోనా పరీక్షలు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 3,29,77,640 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,16,585. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 22,94,818. రాష్ట్రంలో 6వేల 754 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Ap Corona

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 713కి పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. రోజురోజుకి కేసులు తగ్గుతుండటం ఊరటనిచ్చే అంశం అని నిపుణులు అంటున్నారు.

Corona Vaccination: దేశంలో 80శాతం మంది వయోజనులకు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసులు 20 వేల దిగువకు చేరడం ఊరటనిచ్చే అంశం. మరోవైపు రికవరీలు గణనీయంగా పెరుగుతుండటంతో.. యాక్టివ్ కేసులు తగ్గిపోతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 11,87,766 కరోనా పరీక్షలు చేయగా.. 19,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

అంతకుముందు రోజుతో పోల్చితే 2,300 కేసులు తగ్గాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.68%కి పడిపోయింది. నిన్న మరో 673 మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,11,903కు చేరింది.

Corona Cases In Ap

కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న 48వేల 847 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.20 కోట్లు దాటింది. ఆ రేటు 98.28%కు పెరిగింది.

Covid Rules : కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే రూ.25వేలు ఫైన్, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

ఇక యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఆ రేటు 0.52%కి పడిపోయి.. ఆ సంఖ్య 2,24,187కు తగ్గింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. దేశంలో నిన్న 30,81,336 మంది టీకాలు వేయించుకున్నారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 175 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా లెక్కలు వెల్లడించింది.