AP Covid : ఏపీలో కరోనా కేసులు..624 మందికి వైరస్

తాజాగా 24 గంటల వ్యవధిలో 624 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

AP Covid : ఏపీలో కరోనా కేసులు..624 మందికి వైరస్

Ap Corona

Updated On : October 10, 2021 / 6:09 PM IST

AP reports 624 New Covid cases : ఏపీలో కరోనా కేసులు ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతున్నాయి. గతంలో కన్నా..తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 624 మందికి కరోనా సోకింది. నలుగురు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,54,358 పాజిటివ్ కేసులకు గాను…20,32,159 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

Read More : MAA Elections: కౌంటింగ్‌లో రచ్చ.. ఎన్నికల అధికారితో ప్రకాష్ రాజ్ గొడవ

14 వేల 254 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 7 వేల 944గా ఉందని తెలిపింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 151 మంది వైరస్ బారిన పడ్డారు. 38 వేల 312 శాంపిల్స్ పరీక్షించగా…624 మందికి కరోనా సోకిందని నిర్ధారించారు. కోవిడ్ వల్ల కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, వైఎస్ఆర్ కడపలో ఒక్కోక్కరు చొప్పున మరణించారు.

Read More :TSRTC : దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 09. చిత్తూరు 87. ఈస్ట్ గోదావరి 151. గుంటూరు 87. వైఎస్ఆర్ కడప 19. కృష్ణా 51. కర్నూలు 13. నెల్లూరు 66. ప్రకాశం 53. శ్రీకాకుళం 14. విశాఖపట్టణం 30. విజయనగరం 08. వెస్ట్ గోదావరి 36. మొత్తం : 624.