రాజధాని మార్చుకోండి.. వడ్డీ లేని రుణాలివ్వండి : జగన్ కు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి

రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 07:36 AM IST
రాజధాని మార్చుకోండి.. వడ్డీ లేని రుణాలివ్వండి : జగన్ కు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి

Updated On : December 27, 2019 / 7:36 AM IST

రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని

రాజధాని, సచివాలయం తరలింపుపై ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం స్పందించింది. సచివాలయ తరలింపుపై జగన్ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి ఉద్యోగుల్లో వ్యతిరేకతా లేదు.. సానుకూలతా లేదని ఆయన చెప్పారు. అలాగని.. రాజధాని మార్పునకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే సీఎం జగన్ ను కలిసి తమ సమస్యలను వివరిస్తామని.. వాటిని పరిష్కరించాలని కోరతామన్నారు. తమకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని సీఎంను అడుగుతామన్నారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అమలు చేయాల్సిందే అన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత.. హైదరాబాద్ లో కుటుంబాలను ఉంచి అమరావతిలో ఉద్యోగం చేస్తున్నామని సచివాలయం ఉద్యోగులు తెలిపారు. కొందరు ఉద్యోగులు అమరావతిలోనే భూములు, ఇళ్లు కొనుగోలు చేశారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ విశాఖకు షిఫ్ట్ అవ్వాలంటే కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ అంశాలను సీఎం జగన్ దగ్గర ప్రస్తావిస్తామని వెంకట్రామిరెడ్డి తెలిపారు. కాగా, సచివాలయం తరలింపు ప్రతిపాదనపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చని అసెంబ్లీలో సంచలన ప్రకటన చేసిన సీఎం జగన్… విశాఖపట్నం ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా మారే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి ఉండొచ్చని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. సీఎం జగన్ ప్రకటనతో ఇక ఏపీ సచివాలయం విశాఖకు తరలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. పరిపాలన వ్యవహారాలన్నీ విశాఖ నుంచే ఉండొచ్చని సీఎం జగన్ ప్రకటన చేయడంతో… ఆయనతో పాటు ఉద్యోగులు, ఇతర ఆఫీసులన్నీ విశాఖకు తరలిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కీలకం కావడంతో… ఇక ఏపీలో విశాఖ మిగతా నగరాల కంటే మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోయే ఛాన్స్ ఉంది.

అయితే, ఏ రాష్ట్రంలోనూ శాసన సభ – సచివాలయం.. వేర్వేరు నగరాల్లో లేవు. నిజానికి ఎక్కువ మంది రాజనీతి శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఎక్కడ సచివాలయం ఉంటుందో అదే సాంకేతికంగా రాజధాని అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పాలన సచివాలయం కేంద్రంగానే సాగుతుంది. ఆ పాలన గురించి ప్రభుత్వం తరపున సీఎం, మంత్రి మండలి.. ప్రజలు ఎన్నుకున్న సభ్యులకు సమాధానం చెప్పే వేదిక శాసన సభ. కాబట్టి, సచివాలయం ఉన్న చోటే రాజధానిగా భావించాల్సి ఉంటుంది.