Andhra Pradesh: సమగ్ర అభివృద్ధిలో ఏపీదే అగ్రస్థానం

సమగ్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ ముందంజలో ఉంది.

Andhra Pradesh: సమగ్ర అభివృద్ధిలో ఏపీదే అగ్రస్థానం

Updated On : September 30, 2022 / 4:25 PM IST

Andhra Pradesh: సమగ్ర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది. తాజా గణాంకాల ప్రకారం.. 2022 జనవరి నుంచి జూలై వరకు పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2022లో మొదటి ఏడు నెలల్లో దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తే.. ఒక్క ఏపీలోనే రూ.40,361 కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి.

Kanpur Hostel: అమ్మాయిల అసభ్య వీడియోలు చిత్రీకరించిన హాస్టల్ స్వీపర్.. ఫిర్యాదు చేసిన యువతులు

దేశంలో రెండంకెల వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ నిలిచింది. 2021-22లో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌‌డీఎస్పీ) వృద్ధిరేటులో ఏపీనే నంబర్ వన్‌గా నిలిచింది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. అదే సమయంలో ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతం కావడం విశేషం. వరుసగా మూడేళ్లపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా నిలిచింది.