కూటమి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

ఎన్టీయే కూటమి శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Chandrababu Naidu

Chandrababu Naidu : ఎన్టీయే కూటమి శాసనసభా పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూటమి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం ఉదయం విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు టీడీఎల్పీ పక్ష నేతగా చంద్రబాబును పేరును ప్రతిపాదించగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ఎన్డీఏ కూటమి శాసనసభ పక్షానేత గా చంద్రబాబు పేరు ప్రతిపాదించారు. కూటమి ఎమ్మెల్యేలు పవన్ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించారు.

Also Read : జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని కూటమి నేతలు గవర్నర్ కు పంపనున్నారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పలకనున్నారు. బుధవారం ఉదయం 11.27గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ట్రెండింగ్ వార్తలు