జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు.

జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఏకగ్రీవ ఎన్నిక

Pawan Kalyan

Updated On : June 11, 2024 / 10:36 AM IST

Janasena chief Pawan Kalyan : జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.

Also Read : Ram Charan : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్.. బాబాయ్ కోసం అబ్బాయి.. మరి ఎన్టీఆర్ కూడా వస్తాడా?

ఏపీలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీచేసిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థులు 21 నియోజకవర్గాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి వంద శాతం స్ట్రైక్ రేటు కలిగిన పార్టీగా జనసేన పార్టీ రికార్డును క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఏపీలో అత్యధిక ఎమ్మెల్యేలు కలిగినఉన్న పార్టీగా టీడీపీ తరువాత జనసేన రెండో స్థానంలో నిలిచింది. వైసీపీ నుండి కేవలం 11 మంది అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు.