Ram Charan : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్.. బాబాయ్ కోసం అబ్బాయి.. మరి ఎన్టీఆర్ కూడా వస్తాడా?

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.

Ram Charan : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్.. బాబాయ్ కోసం అబ్బాయి.. మరి ఎన్టీఆర్ కూడా వస్తాడా?

Ramcharan to attend Chandrababu Naidu's swearing-in ceremony as CM

Updated On : June 11, 2024 / 9:36 AM IST

Ram Charan : ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టనున్నారు. గన్నవరం వద్ద కేసరపల్లి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జూన్ 12న ఉదయం 11.27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీతో సహా దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు రానున్నారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. దీంట్లో భాగంగా రామ్ చరణ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్నారు. అదే రోజు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కూడా డిప్యూటీ సీఎంగా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం.

Also Read : Deepika Padukone : కల్కి ట్రైలర్ ఓకే.. కానీ దీపికా పదుకోన్ డబ్బింగ్ పై విమర్శలు..

బాబాయ్ పవన్ కోసం కూడా రామ్ చరణ్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ కూడా కేసరపల్లిలో జరగబోయే ప్రమాణ స్వీకారానికి రాబోతున్నాడని తెలిసి అభిమానులు కూడా భారీగా హాజరవనున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ వెళ్తుండటంతో మరి ఎన్టీఆర్ కూడా వస్తాడా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల కూటమి గెలుపు తర్వాత ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అభినందిస్తూ ఓ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వస్తాడా అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.