Deepika Padukone : కల్కి ట్రైలర్ ఓకే.. కానీ దీపికా పదుకోన్ డబ్బింగ్ పై విమర్శలు..

కల్కి ట్రైలర్ లో డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు అనిపిస్తుంది. అందరికంటే కూడా దీపికా పదుకోన్ డబ్బింగ్ అసలు బాగోలేదని విమర్శలు చేస్తున్నారు.

Deepika Padukone : కల్కి ట్రైలర్ ఓకే.. కానీ దీపికా పదుకోన్ డబ్బింగ్ పై విమర్శలు..

Trolls on Deepika Padukone Dubbing in Kalki 2898 AD Movie Trailer

Updated On : June 11, 2024 / 9:17 AM IST

Deepika Padukone : దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ప్రభాస్ కల్కి సినిమా నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కల్కి ట్రైలర్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని అంతా అభినందిస్తున్నారు. కానీ కల్కి ట్రైలర్ లో అందరూ ఒక విషయంపై మాత్రం విమర్శిస్తున్నారు.

Also Read : Kamal Haasan : కల్కి ట్రైలర్ లో కమల్ హాసన్ ని గమనించారా..? కొత్త లుక్ లో..

కల్కి ట్రైలర్ లో డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా లేదు అనిపిస్తుంది. అందరికంటే కూడా దీపికా పదుకోన్ డబ్బింగ్ అసలు బాగోలేదని విమర్శలు చేస్తున్నారు. అది దీపికానే చెప్పిందా, లేదా వేరే ఎవరైనా చెప్పారా, ఆ తెలుగు ఏంటి ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్నారు? చివర్లో హడావిడిగా దీపికాతో డబ్బింగ్ చెప్పించారా? లేక సినిమాలో క్యారెక్టర్ అలాగే మాట్లాడుతుందా అని ప్రశ్నిస్తూ కల్కి ట్రైలర్ లోని దీపికా పదుకోన్ క్యారెక్టర్ డబ్బింగ్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.

దీంతో దీపికా పదుకోన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే దీపికా గర్భవతిగా నటించింది. నటన పరంగా దీపికాకు వంకలు పెట్టలేకపోయినా తెలుగు డబ్బింగ్ పై మాత్రం కామెంట్స్ చేస్తున్నారు. మరి సినిమాలో కూడా ఇలాగే ఉంటుందా చూడాలి.