Kamal Haasan : కల్కి ట్రైలర్ లో కమల్ హాసన్ ని గమనించారా..? కొత్త లుక్ లో..

కమల్ హాసన్ సినిమా కోసం ఎలాంటి గెటప్ అయినా వేస్తారు, ఎంత కష్టం అయినా పడతారని తెలిసిందే.

Kamal Haasan : కల్కి ట్రైలర్ లో కమల్ హాసన్ ని గమనించారా..? కొత్త లుక్ లో..

Kamal Haasan New Heavy Getup in Kalki 2898AD Movie.. Image Credits : Vyjayanthi Network

Updated On : June 11, 2024 / 8:49 AM IST

Kamal Haasan : ప్రభాస్ కల్కి సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, బుజ్జి వెహికల్, యానిమేషన్ సిరీస్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక నిన్న రిలీజ్ చేసిన కల్కి ట్రైలర్ అయితే ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఉన్న కల్కి ట్రైలర్ ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తామా అని ఎదురుచూస్తున్నారు. ఇక కల్కి సినిమా జూన్ 27న రిలీజ్ కానుంది.

అయితే నిన్న ట్రైలర్ లో చాలా ఆసక్తికర అంశాలు చూపించారు. ట్రైలర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే విలన్ పాత్ర అవునా కాదా అనేది క్లారిటీ లేకపోయినా కమల్ ఒక ముఖ్య పాత్రలో కల్కి సినిమాలో నటిస్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ లో చివర్లో కమల్ హాసన్ ఓ కొత్త లుక్ లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Also Read : ప్రభాస్ ‘కల్కి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టేసిన భైరవ, బుజ్జి

కమల్ హాసన్ సినిమా కోసం ఎలాంటి గెటప్ అయినా వేస్తారు, ఎంత కష్టం అయినా పడతారని తెలిసిందే. గతంలో చాలా సినిమాల్లో అనేక రకాల గెటప్స్ తో అలరించిన కమల్ హాసన్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా బాగా ముసలి వ్యక్తిగా ఈ సరికొత్త లుక్ లో కనపడి అదరగొట్టారు. అయితే కమల్ హాసన్ ఇందులో కలి పాత్రలో, నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తారని సమాచారం. దీంతో కమల్ ఫ్యాన్స్ కూడా కల్కి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ చూసాక నాగ్ అశ్విన్ ఏదో భారీగానే ప్లాన్ చేసాడని అర్ధమవుతుంది.