AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన 50.79శాతం మంది అభ్యర్థులు

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి..

AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన 50.79శాతం మంది అభ్యర్థులు

AP TET Results (Credit _ Google Image)

Updated On : November 4, 2024 / 12:32 PM IST

AP TET Results 2024: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేశారు. 50.79శాతం ఉత్తీర్ణతతో 1,87,256 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 (86.28శాతం) మంది హాజరయ్యారు.

Also Read: Srikanth Kidambi : సీఎం చంద్ర‌బాబును క‌లిసిన కిదాంబి శ్రీకాంత్.. కాబోయే భార్య‌తో..

మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతిహామీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్ -2024 ఫలితాలను సోమవారం విడుదల చేస్తున్నాం. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది హాజరుకాగా, అందులో 1,87,256 ( 50.79 శాతం) మంది అర్హత సాధించారని నారా లోకేశ్ అన్నారు. ఫలితాలను https://cse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చునని, నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని లోకేశ్ చెప్పారు. టెట్ లో అర్హత సాధించిన వారందరికీ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

 

AP TET Results 2024