పెద్దాయన (బాబు)కు ఎంత టైం – సీఎం జగన్..సార్..టైం ఇవ్వాలి..బాబు

ఏపీ శాసనసభలో తనకు మరికాస్త టైం ఇవ్వాలన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఏపీ శాసనసభలో మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు మాట్లాడారు. సుదీర్ఘంగా మాట్లాడుతున్నారు. దీనిపై సీఎం జగన్ జోక్యం చేసుకున్నారు. ఇంకా ఎంత సేపు మాట్లాడుతారు అంటూ ప్రశ్నించారు. ‘బాబు మైక్ పట్టుకుని 50 నిమిషాలు అయ్యింది. ఇంకా ఎంత సేపు కావాలి ? వాళ్లు ఉన్నది కేవలం 21 మంది మాత్రమే.
వారిలో నుంచి ఐదుగురు మాట్లాడారు. కానీ..తమ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలున్నారు. కేవలం 7 మంది మాట్లాడారు’ అని తెలిపారు. బాబు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. నోరు తెరిస్తే..అన్నీ అబద్దాలేనంటూ సీఎం జగన్ విమర్శించారు. కానీ తనకు ఇంకా టైం ఇవ్వాలని బాబు కోరారు. దీనికి స్పీకర్ నో చెప్పారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు.
2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు.
Read More : బాబువన్నీ తప్పే : శివరామకృష్ణన్ కమిటీ..ఇదిగో వాస్తవాలు