Jagan
Unemployed in AP: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారం చెప్పటి మూడేళ్లు కావొస్తున్నా.. సీఎం జగన్ ఇంతవరకు ఉద్యోగ భర్తీలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంపై నిరుద్యోగ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపిస్తున్నారు. విశాఖ నగరంలోని ఎంవీపీ కూడలి వద్ద ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ సభ్యులు మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో 2 లక్షల 32 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్న సీఎం జగన్, మూడు సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం ఆందోళన రేకెత్తిస్తుందని అన్నారు.
Also read: AP CM Jagan : ఆదాయం పెంచుకొనే మార్గాలపై సీఎం జగన్ దృష్టి
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ఆలస్యం చేస్తుండడంతో నిరుద్యోగులు ఉద్యోగ వయోపరిమితి కోల్పోయి రోడ్డున పడుతున్నారని జెఏసి నాయకులు అన్నారు. రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల మంది నిరుద్యోగ కుటుంబాలు.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్న కొందరు ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని నిరుద్యోగ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. దీనికి తోడు ఉద్యోగ విరమణ వయస్సును 62 సంవత్సరాలు పెంచడం వల్ల నిరుద్యోగుకు మరొక రెండు సంవత్సరాలు ఉద్యోగాలు దూరమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఉద్యోగ విరమణ వయస్సు 60 సంవత్సరాలు కుదించి, ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలనీ డిమాండ్ చేశారు.
Also read: Chandrababu : చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్… సీఎస్‌కు చంద్రబాబు లేఖ