AP CM Jagan : ఆదాయం పెంచుకొనే మార్గాలపై సీఎం జగన్ దృష్టి

వివిధ రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడి విధానాలను పరిశీలించి రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలని...

AP CM Jagan : ఆదాయం పెంచుకొనే మార్గాలపై సీఎం జగన్ దృష్టి

Cm Jagan

AP CM Revenue : ఏపీలో ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతోంది. కరోనా పరిస్థితులతో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేగాకుండా పలు పథకాలకు భారీగా డబ్బులు అవసరం పడుతోంది. దీంతో ఆదాయం ఎలా పెంచుకోవాలనే దానిపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఆదాయం పెంచుకొనేందుకు వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా..అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. 2022, ఫిబ్రవరి 16వ తేదీ బుధవారం ఆదాయాన్ని ఆర్జించే శాఖలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Read More : AP Covid : ఏపీలో కరోనా.. ఊపిరిపీల్చుకుంటున్న జనాలు, కొత్తగా ఎన్ని కేసులంటే

అదనపు ఆదాయం కోసం కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాలు పాటిస్తున్న విధానాలు అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడి విధానాలను పరిశీలించి రాష్ట్ర సొంత ఆదాయం పెరిగేందుకు తగిన ఆలోచనలు చేయాలని అధికారులను సూచించారు. ఆదాయ మార్గాలు కార్యరూపంలోకి తేవడంపై దృష్టి పెట్టాలి. అయితే నిబంధనలను మాత్రం పక్కాగా పాటించాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయం తేవడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలన్నారు జగన్.
పెండింగ్‌లో ఉన్న వ్యాట్‌ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టుకోవడంపై దృష్టి సారించాలన్నారు జగన్.

Read More : JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మండిపడ్డ జేసి ప్రభాకర్ రెడ్డి

గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంత త్వరగా వేగవంతం చేయాలన్నారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి తగిన మార్పులు చేయాలన్నారు. సీఎస్‌ సమీర్‌శర్మ, రాష్ట్రమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.