JC Prabhakar Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై మండిపడ్డ జేసి ప్రభాకర్ రెడ్డి
ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.

Peddareddy
JC Prabhakar Reddy: తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుపై స్పందించిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు. బుధవారం 10 టీవీ ప్రతినిధితో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. తాడిపత్రి అబివృద్దికి ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అబివృద్ది చేసితీరుతానని జేసి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రిలో మున్సిపాలిటీ స్థలాలు కబ్జాకు గురౌతున్నాయని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఏలాంటి స్పందన లేదన్నారు. స్థలాల కబ్జాపై ఏడాది క్రితం ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని జేసీ ప్రభాకర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
Also read: Chandrababu : చిత్తూరు జిల్లాలో అక్రమ మైనింగ్… సీఎస్‌కు చంద్రబాబు లేఖ
ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వేసే ప్లాట్లను ఎవరైనా కొంటే.. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే జేసీబీలతో దున్నిస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేషనల్ హైవేలో తన తండ్రి విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని, అసలు నేషనల్ హైవేలో విగ్రహాలు ఏలా పెడతారని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటులో తనకు ఏలాంటి అభ్యంతరము లేదన్న ప్రభాకర్ రెడ్డి, జాతీయ రోడ్డ రవాణాశాఖ అధికారులు ఓ పక్క విగ్రహాలు తొలగిస్తుంటే ఇక్కడ నేషనల్ హైవేలో విగ్రహం ఏర్పాటు ఏంటంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుపై ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు.
Also read: Telangana : బీజేపీకి అధికారం ఇస్తే తెలంగాణను ఏపీలో కలిపేస్తారు : కేటీఆర్
ఎమ్మెల్యే పెద్దారెడ్డి తండ్రి ఏమైనా స్వతంత్ర సమర యోదుడా? దేశం కోసం పోరాటం చేశాడా? ఈ విషయాలు ప్రజలకు చెప్పాలని ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. “ఇప్పుడు వాళ్ల తండ్రి విగ్రహం ఏర్పాటు చేసినా తరువాత అతనే బాదపడాల్సి వస్తుందని.. ఎందుకంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి మహా అంటే ఇక రెండేళ్లు పదవిలో ఉంటాడు.. పదవి పోయిన తరువాత గిట్టనివారెవరైనా ఆ విగ్రహానికి పాత చెప్పుల దండ వేశారనుకో లేక విగ్రహంపై కాకిరెట్ట వేసిందనుకో బాదపడాల్సింది నువ్వే అది తెలుసుకో” అంటూ పెద్దారెడ్డి నుద్దేశించి ప్రభాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మా నాన్న జేసి నాగిరెడ్డి స్వతంత్ర సమరయోదుడు, దేశం కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లాడు, మాజీ ఎంపీ అయినా మేము ఎక్కడా మా నాన్న విగ్రాలు పెట్టలేదే” అని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also read: Sajjala : వివేకా హత్య కేసు.. సీబీఐ ఛార్జిషీట్‌లో కుట్ర ఉంది-సజ్జల సంచలనం