Vaccine Vinayaka : వ్యాక్సిన్ వినాయకుడు..టీకా వేయించుకుంటేనే రమ్మంటున్నాడు..

భక్తులారా..కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి అని చెబుతున్నాడు గణేషుడు. టీకా వేయించుకోండీ..జాగ్రత్తలు పాటించండీ..అంటూ సందేశాన్నిస్తున్నాడు ఈకరోనా కాలపు వినాయకుడు.

Vinayaka Chavithi 2021: ఏ రూపంలో అయినా ఒదిగిపోయే గణనాధుడు..ఆయా రోజుల్లో ట్రెండ్ కు ప్రతిరూపంగా నిలుస్తుంటాడు. పలు రకాల సంక్షోభాల్లో కూడా గణపయ్య సందేశాలను ఇస్తు జనలకు అప్రమత్తం చేస్తుంటాడు. ఈ కరోనా కాలంలో కూడా గణపతి అటువంటి సందేశాలనే ఇస్తున్నాడు. కరోనా మొదటి వేవ్ సమయంలో వలస కార్మికుల కష్టాలకు ప్రతిరూపాలుగా నిలిచిన వినాయకుడు..కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ విషయంలో కూడా సందేశాన్ని ఇస్తున్నాడు. వ్యాక్సిన్ వేయించుకోండి భక్తులారా?అంటూ అవగాహన కల్పిస్తున్నాడు.

Read more : Ganesh Chaturthi 2021: వినాయక చవితి సందర్భంగా ఆ గణపతికి రూ.6కోట్ల విలువైన కిరీటం

దీంట్లో భాగంగానే ఏపీలోని విశాఖలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ వినాయకుడు అందరిని ఆకట్టుకుంటున్నాడు. తాటిచెట్లపాలెంలో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలనే సందేశంతో గణనాథుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. భారీ వ్యాక్సిన్ బాటిల్ ను తయారు చేసి అందులో వినాయకుడు ప్రతిమను పెట్టి పూజిస్తున్నారు. వ్యాక్సిన్ బాటిల్ లో వినాయకుడు..వ్యాక్సిన్ వేసే సిరంజి వద్ద పెట్టిన మూషికం ఉండేలా సెట్టింగ్ ఏర్పాటు చేశారు.

Read more : Punjab Govt: వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు!

కరోనా కాలంలో న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో భక్తులకు మాస్క్ లేకపోతే ప్రవేశం లేదని స్పష్టంగా చెబుతున్నారు. అలాగే మండపంలో కరోనా జాగ్రత్తలు పాటిస్తున్నారు. శానిటైజేషన్ తప్పకుండా పాటిస్తున్నారు. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన వైరస్ ను దేవుడి రూపంలో ఉన్న వ్యాక్సిన్ ను అందరూ వేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. మొదటి డోస్ వేసుకున్న వాళ్ళు.. సెకెండ్ డోస్ ఎన్ని రోజులకు వేసుకోవాలి..? వ్యాక్సిన్ తో ప్రయోజనాలను వివరిస్తూ ప్రత్యేక ఫ్లెక్సీలు పెట్టారు.

Read more :Corona 2nd Wave : జాగ్రత్త.. ముప్పు తొలగలేదు.. కరోనాపై కేంద్రం తాజా హెచ్చరిక

ఇక ఒకవైపు వ్యాక్సిన్ వినాయకుడితో అవగాహన కల్పిస్తూనే.. సిబ్బంది సహకారంతో అక్కడే వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశారు. విశాఖలో అందరిలో వ్యాక్సిన్ పై అపోహలు తొలగించేలా అవగాహన కల్పిస్తున్న ఈ వినాయకుడిని భక్తులు పూజించడంతో పాటు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు