APERC electricity tariff : ఏపీలో కొత్త విద్యుత్ టారీఫ్…
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2021-22కి విద్యుత్ టారిఫ్ ను ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

Aperc Electricity Tariff
APERC announced electricity tariff : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2021-22కి విద్యుత్ టారిఫ్ ను ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటన అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. సగటు యూనిట్ ధర రూ.7.17 నుంచి రూ.6.37కు తగ్గనున్నట్లు పేర్కొంది. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తికి పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తించనుంది.
ఈ సందర్భంగా ఏపీ ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కులవృత్తుల వారికిచ్చే ఉచిత విద్యుత్ కొనసాగుతుందన్నారు. కులవృత్తులకు ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల రూ.1,657 కోట్ల భారం పడుతుందని, రైతుల ఉచిత విద్యుత్‌కు రూ.7,297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు.
1. గృహ వినియోగదారుడికి ఇకపై కనీస ఛార్జీలు ఉండవు
2. ఛార్జీల స్థానంలో కిలోవాట్‌కు రూ.10 చెల్లిస్తే చాలు
3. ఫంక్షన్‌హాళ్లకు కూడా ఇకపై నిర్ధిష్ట ఛార్జీలు ఉండవు
4. పరిశ్రమల కేటగిరీలో ఆక్వా, పౌల్ట్రీ రంగాలను చేర్చాం
5. గిరిజన తండాల్లో నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
6. రజక సంఘం నడుపుతున్న లాండరీలకు నెలకు 150 యూనిట్ల ఉచిత విద్యుత్
7. బీపీఎల్ పరిధిలోని స్వర్ణకారులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
8. బీపీఎల్‌లో ఉన్న ఎంబీసీ వర్గాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
9. నాయీ బ్రాహ్మణ వృత్తిదారులకు నెలకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
10. చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
11. యూనిట్ రూ.2.35 పైసలకే ఆక్వారైతులకు రాయితీపై విద్యుత్
12. సబ్సిడీ విద్యుత్ కోసం ప్రభుత్వంపై రూ.9,091.36 కోట్లు భారం