ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఈ పరీక్షను రాసే అవకాశం ఉంది.

APPSC Group 2

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. 2025 జనవరి 5న 13 ఉమ్మడి జిల్లాల్లో గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది ఈ పరీక్షను రాసే అవకాశం ఉంది. ఏపీలో డీఎస్సీతో పాటు ఎస్ఎస్సీ, ఇంటర్ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్-2 మెయిన్స్ రాత పరీక్ష తేదీని ఖరారు చేశారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కమిషన్ వెబ్‌సైట్ portal-psc.ap.gov.in చూడొచ్చు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. అలాగే, ఏపీ టెట్ జులై – 2024 ఫైనల్‌ కీను ఇవాళ విడుదల చేశారు. నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటిస్తారు.

మెగా డీఎస్సీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన..