APTF Boycotting Teacher’s Day : ఏపీటీఎఫ్ కీలక నిర్ణయం..ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏపీటీఎఫ్ ప్రకటించింది. ఈనెల 5న ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలకు ఏపీ టీచర్స్ ఫెరడేషన్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.

APTF boycotting Teacher's Day
APTF Boycotting Teacher’s Day : ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ఏపీటీఎఫ్ ప్రకటించింది. ఈనెల 5న ప్రభుత్వ సత్కారాలు, సన్మానాలకు ఏపీ టీచర్స్ ఫెరడేషన్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులను ప్రభుత్వం అవమానస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
అక్రమ నిర్బంధాలు, బైండోవర్లను తీవ్రంగా పరగణిస్తున్నామని పేర్కొంది. సొంత ఫోన్లలో ఫొటోలతో హాజరు వేసేలా ఒత్తిడి తేవడాన్ని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. సీపీఎస్ రద్దు హామీపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారని ఏపీటీఎఫ్ నాయకులు వాపో్యారు.