Vizianagaram
Vizianagaram : విజయనగరం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. జాతీయరహదారి 26పై వెళ్తున్న సమయంలో గొట్లాం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్ఐ ఆర్.వాసుదేవ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లిమర్ల మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన త్రినాథరావు (30) జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. 2018లో తన అక్క కూతురు కీర్తీతో త్రినాథరావు వివాహం జరిగింది. ఆరురోజుల క్రితం సెలవులపై సొంతూరుకు వచ్చారు త్రినాథ్.
చదవండి : Vizianagaram Accident : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు
ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారుజామున బైక్‍పై విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తుండగా గొట్లాంకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో త్రినాథరావు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఆర్.వాసుదేవ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు. దేశసైనికుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గాంధీనగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవండి : Vizianagaram : వైభవంగా శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం