Vizianagaram Accident : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 22 మందికి గాయాలు
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది.

Road Accident (2)
Road Accident : విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బొండపల్లి మండలం చామలపల్లి సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను గజపతినగరం పీహెచ్సీకి తరలించారు.
చదవండి : Sangam Auto Accident : సంగం ఆటో ప్రమాదం.. వాగులో గల్లంతైన ప్రయాణికుల కోసం ముమ్మర గాలింపు
తీవ్రంగా గాయపడిన వారిని విశాఖకు తరలించారు. క్షతగాత్రులు మెంటాడ మండలం చింతాడవలస వాసులుగా గుర్తించారు. రాచకిండాంలో వివాహానికి హాజరై ట్రాక్టర్లో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో 35 మంది ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చదవండి : Road Accident : కేరళలో రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి