Dwarka Tirumala : ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు

గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ సౌకర్యం కల్పించారు. దేవాదాయ శాఖ ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచింది.

Dwarka Tirumala

Dwarka Tirumala Mukkoti Ekadashi : చిన తిరుపతిగా పేరోందిన ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 23న ఉత్తర ద్వార దర్శనానికి అధికారులు ఆలయాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సర్వదర్శనం రూ.100, రూ.200, రూ.500 టికెట్లకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు.

గోవింద స్వాములకు, గ్రామస్తులకు మరో ప్రత్యేక క్యూలైన్ సౌకర్యం కల్పించారు. దేవాదాయ శాఖ ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచింది. ముక్కోటి ఏకాదశి ముందు రోజు 22న స్వామివారి గిరి ప్రదక్షిణ ఉంటుంది.

Ayodhya Ram Temple : రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ పూజ ఎవరు నిర్వహిస్తారంటే…

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. డైరెక్ట్ లైన్ ద్వారా శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 64,040 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.17 కోట్లు వచ్చింది.

తిరుమలలో వైకుంఠద్వార దర్శనానికి టీటీడీ సర్వం సిద్ధం చేసింది. డిసెంబర్ 23 నుంచి భక్తులకు కల్పించనున్న వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.