Pusapati Ashok Gajapathi Raju
గోవా, హరియాణా రాష్ట్రాలకు గవర్నర్‌లను, లద్ధాఖ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీచేశారు. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు.
హరియాణా గవర్నర్‌గా ఆషిమ్ కుమార్ ఘోష్, లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా నియమితులయ్యారు. మరోవైపు, లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్‌గా బ్రిగెడియర్ (డాక్టర్) బీడి మిశ్రా (రిటైర్డ్) రాజీనామాను రాజ్యపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
Also Read: ‘ఇందులో ఇండియా జోక్యం చేసుకోలేదు.’ సుప్రీంకు స్పష్టం చేసిన కేంద్రం..
కాగా, అశోక్ గజపతి రాజు 1951, జూన్ 16న జన్మించారు. ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగాగా, ఒక సారి ఎంపీగా గెలిచారు. ఆయన తొలిసారిగా జనతా పార్టీ నుంచి 1978లో పోటీ చేశారు. 1983 నుంచి 2014 మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో పలుసార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడి మంత్రి వర్గాల్లో మంత్రిగా పనిచేశారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
“గోవా గవర్నర్ గా నియమితులైన మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు, అత్యంత ఆప్తులు అశోక్ గజపతి రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను” అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు.
పదవుల కోసం ఎప్పుడూ పరితపించలేదు: అశోక్ గజపతిరాజు
గోవా గవర్నర్‌గా నియమితుడు కావడంతో దీనిపై అశోక్ గజపతిరాజు విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. “ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నా పేరును ప్రతిపాదించడం అదృష్టంగా భావిస్తాను. పదవుల కోసం నేను ఎప్పుడూ పరితపించలేదు. వచ్చిన తర్వాత బాధ్యతగా పనిచేయడమే నా సిద్ధాంతం. తెలుగువారి ఖ్యాతిని మరింత పెంచేలా బాధ్యతలు నిర్వర్తిస్తా.
సుమారు 40 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాను. ఎన్నో పదవులు చేపట్టాను. గవర్నర్ రాజ్యాంగ పదవి కాబట్టి, ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. గవర్నర్ గా రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటా. గోవా ముఖ్యమంత్రి, ప్రస్తుత గవర్నర్ తో మాట్లాడాను” అని తెలిపారు.