Huge Changes Additions In YSRCP
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు. ఇక ఎంపీలుగా ఉన్న వారికి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి ఎంపీలుగా అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. 15 మంది ఎంపీలకు అసెంబ్లీ సీట్లు ఇస్తారని తెలుస్తోంది. 20మందికి పైగా ఎంపీలకు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. మరోవైపు 30మందికి పైగా కొత్త వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారట. ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం జగన్. అందులో భాగంగా పార్టీలో భారీగా మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పుడున్న కొందరు ఎమ్మెల్యేలను తప్పించి కొత్త వారికి టికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గెలుపు గుర్రాలవైపే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారు. వైసీపీలో భారీ మార్పులకు నిర్ణయం తీసుకున్న జగన్ చాలా కాలంగా దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. ఈ మార్పుల ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : ఆ ఐదుగురికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్
ఇప్పటికే 11 చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జులను మార్చేశారు జగన్. మరికొన్ని స్థానాల్లోనూ మార్పులు చేయనున్నారు. దీనికి సంబంధించి త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలకు సంబంధించి మార్పులు జరిగాయి. ఇక, ఉభయ గోదావరి జిల్లాలలో మార్పులకు సంబంధించిన కసరత్తు తుది దశకు వచ్చింది.
Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?
వచ్చే ఎన్నికల్లో 15మంది వరకు ఎంపీలను ఎమ్మెల్యే స్థానాలకు పంపిస్తారని తెలుస్తోంది. 20 మందికిపైగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా పోటీ చేయనున్నారని సమాచారం. 30 మందికిపైగా కొత్త వ్యక్తులు అసెంబ్లీకి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, రిజర్వేషన్ కూడా కవర్ చేసుకుంటూ మొత్తం 175 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు జగన్. ఏడుగురు ఎస్టీ అభ్యర్థులు, 29 మంది ఎస్సీ అభ్యర్థులు రిజర్వేషన్ ప్రాతిపదికన ఉంటారు. ఇక మిగిలిన 139 స్థానాల్లో మొత్తం 50 స్థానాలు పూర్తిగా బీసీలకు ఇవ్వాలి, మిగిలిన స్థానాల్లో మాత్రమే జనరల్ అభ్యర్థులు ఉంటారని తెలుస్తోంది.