CM Jagan : ఆ ఐదుగురికి నో టికెట్.. ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్
మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్.

CM Jagan Shock For MLAs
మరో ఐదుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని తేల్చేశారు సీఎం జగన్. తాడేపల్లిలో ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, పర్వత ప్రసాద్, పెండెం దొరబాబు, ఎలీజా, బాలరాజుతో భేటీ అయిన జగన్ వారితో విడివిడిగా మాట్లాడారు. ఐదుగురు ఎమ్మెల్యేలకు ఎందుకు టికెట్లు ఇవ్వడం లేదో చెప్పిన జగన్.. భవిష్యత్తులో మంచి పదవులు ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మంత్రి చెల్లుబోయిన వేణు సిట్టింగ్ స్థానాన్ని మార్చిన జగన్.. ఆయన రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రకటించారు. మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్. ఇక ఉభయ గోదావరి జిల్లాల ఇంఛార్జ్ లను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వేర్వేరుగా సమావేశం అయ్యారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజులతో సీఎం జగన్ విడివిడిగా సమావేశం అయ్యారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని వారికి ముందుగానే సమాచారం ఇచ్చారు. వారితో వేర్వేరుగా సమావేశమైన జగన్.. వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వడం లేదని నేరుగా చెప్పారు.
Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?
ఇప్పటికే రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న మిథున్ రెడ్డి వారితో అనేకసార్లు సంప్రదింపులు జరిపారు. ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు అనే అంశానికి సంబంధించి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, ఫైనల్ గా సీఎం జగన్ నేరుగా వారితో మాట్లాడారు. ఎందుకు టికెట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందో వివరించారు. టికెట్ అనేది లేకపోతే పక్కన పెట్టినట్టు కాదని, రానున్న రోజుల్లో రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని సీఎం జగన్ వారితో చెప్పినట్లు సమాచారం.
ఇక రామచంద్రాపురం టికెట్ ను పిల్లి సుభాష్ చంద్రబోస్(రాజ్యసభ ఎంపీ) కు లేదా ఆయన కుమారుడికి కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఇక కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం ఇంఛార్జిగా నియమించే అవకాశం ఉంది. రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీ ఇంఛార్జ్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : మంత్రి రోజాకు వ్యతిరేకంగా సర్వే రిపోర్ట్‌లు.. పెద్దిరెడ్డి ఇంటి నుంచి మరొకరికి టికెట్?
రామచంద్రాపురానికి సంబంధించి అనేక వివాదాలు తలెత్తాయి. మంత్రి వేణుగోపాల్, పిల్లి సుభాష్ కి విబేధాలు వచ్చాయి. రామచంద్రాపురం టికెట్ మంత్రి వేణుకి ఇస్తే కనుక పార్టీకి గుడ్ బై చెబుతానని పిల్లి సుభాష్ గతంలో అన్నారు. అయితే సీఎం జగన్ తాజా నిర్ణయంతో ఆ వివాదానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. రామచంద్రాపురం టికెట్ ను పిల్లి సుభాష్ కే కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మంత్రి వేణుని రాజమండ్రి రూరల్ కు మార్చినట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మార్పుల ప్రకటన ఇవాళ వెలువడే అవకాశం ఉంది.