Atmakur Bypoll Results
Atmakur Bypoll Results : పొట్టి శ్రీరామలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమైంది. ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది.
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి, బీజేపీ నుంచి భరత్‌కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కిస్తున్నారు. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో లెక్కించనున్నారు. రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపుతో ప్రక్రియ మొదలై మధ్యాహ్నానికి ముగియనుంది. మొదటి రౌండ్ లో 7332 ఓట్లు లెక్కించగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి 5,337 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.
Also Read : Atmakur by Election: ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు షురూ