Atmakur by Election: ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు షురూ

భారీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు నేడు(జూన్ 26)న తెలియనున్నాయి. ఈ రోజు ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

Atmakur by Election: ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు షురూ

Atmakur

Atmakur by Election: భారీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసిన ఆత్మకూరు ఉప ఎన్నికల ఫలితాలు నేడు(జూన్ 26)న తెలియనున్నాయి. ఈ రోజు ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుండగా.. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

నెల్లూరుపాళెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాల కేంద్రంగా ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉప ఎన్నికల కౌంటింగ్ కు విస్తృతంగా ఏర్పాట్లు జరిపారు. పటిష్టమైన పోలీస్ భద్రత వలయంలో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మధ్యాహ్న సమయానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. 14 టేబుళ్లతో 20 రౌండ్స్ ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కేంద్రాల్లోకి ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారినే అనుమతించనున్నారు. ఈ మేరకు ఉదయం 6 గంటలకే ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

Read Also: ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు

2019 సాధారణ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతం 18.18 శాతం తగ్గింది. 2019లో 82.44 శాతం పోలింగ్ నమోదవ్వగా ఉపఎన్నికల్లో 64.26 శాతం పోలింగ్ నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకున్న వారు లక్ష ముప్పై ఏడు వేల ఎనభై ఒకటి. లక్ష ఓట్లు మెజారిటీ మార్కు కోసం అధికార పార్టీ ఎదురుచూస్తుంది. ఖచ్చితంగా ఈ సారి గెలిచి తీరాలనే ధీమాతో బీజేపీ కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా నేతలలో ఉత్కంఠ నెలకొంది.