ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్‌పై దాడి.. కనుబొమ్మపై గాయం

జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలే దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో బస్సుయాత్ర చేస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‎పై దాడి జరిగింది. ఎవరో రాయి విసరడంతో జగన్‌ కనుబొమ్మ పక్కకు రాయి తాకింది. ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం జగన్ మళ్లీ బస్సు యాత్ర ప్రారంభించారు.

విజయవాడలో “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో భాగంగా బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి జరిగింది. వేగంగా వచ్చి జగన్ కనుబొమ్మకు తాకింది రాయి. క్యాట్ బాల్ తో దుండగుడు దాడి చేసినట్లు తెలుస్తోంది.

రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం అయింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయమైంది. విజయవాడలో జగన్ ను చూడడానికి జనం భారీగా వచ్చారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా రోడ్ షో సాగింది. జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలే దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో సీఎం జగన్ ఇవాళ బస్సు యాత్ర ముగించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఆయన బస్సు యాత్ర ప్రవేశించింది. పలువురు నేతలతో కలిసి జగన్ తో కలిసి బస్సు యాత్రలో పాల్గొన్నారు.

వికసిత్ భారత్ థీమ్‌తో బీజేపీ మ్యానిఫెస్టో.. హామీలపై సర్వత్రా ఉత్కంఠ

ట్రెండింగ్ వార్తలు