balineni srinivasa reddy
Balineni Srinivasa Reddy : మంత్రి పదవి కోసం ఎప్పుడూ అర్రులు చాచింది లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ పునర్వవస్థీకరణలో మంత్రి పదవి దక్కకపోవటంతో నిన్నటి నుంచి అలిగిన ఆయన వద్దకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి 3 సార్లు రాయబారం నడిపి ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేశారు.
మంత్రిపదవి పోతే ఎవరికైనా కాస్త బాధ ఉంటుందని అన్న ఆయన…. ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారని 25 మందిని రెండున్నరేళ్ల తర్వాత మారుస్తారని… కాబట్టి పదవి లేకపోతే,రాకపోతే రాజీనామా చేసే మనుషులం కాదని ఆయన చెప్పుకొచ్చారు. తాము ఎల్లప్పుడూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీకి, వైఎస్ జగన్ కు విధేయులం అని ఆయన చెప్పారు.
వైఎస్ జగన్ ప్రకాశం జిల్లాలో నాకు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని చేస్తానని…. మంత్రి ఆదిమూలపు సురేష్ తో తనకు ఎటువంటి విబేధాలు లేవని, ఇద్దరం కలిసి పని చేశామని మా ఇద్దరికీ విబేధాలు లేవని బాలినేని చెప్పారు. నేను రాజీనామా చేశానని వస్తున్న వార్తలను ఆపాలని ఆయన మీడియాను కోరారు.
Also Read : TTD-Annamaya: అన్నమయ్యను అగౌరపరుస్తున్నామన్న వార్తలు అసత్యం, టీటీడీపై దుష్ప్రచారం తగదు: ఎఇఓ ధర్మారెడ్డి
22వ తేదీ ఒంగోలులో మహిళా సాధికారత కార్యక్రమం గురించి సీఎంతో మాట్లాడాను అని బాలినేని చెప్పారు. కొత్త క్యాబినెట్ ముఖ్యమంత్రిగారికి మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నాని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రాలేదని కొందరు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అవి అన్నీ కూడా ఆగిపోతాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో ఎక్కువ సీట్లు తెచ్చుకునేందుకు కృషి చేస్తానని బాలినేని చెప్పారు.