Home Minister Taneti Vanitha : హోంశాఖ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, జగన్‌కు రుణపడి ఉంటా: తానేటి వనిత

సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు.

Home Minister Taneti Vanitha : హోంశాఖ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, జగన్‌కు రుణపడి ఉంటా: తానేటి వనిత

Home Minister Taneti Vanitha

Home Minister Taneti Vanitha : సీఎం జగన్ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో తనకు మరోసారి అవకాశం ఇవ్వడమే కాకుండా కీలకమైన హోంశాఖను తనకు కేటాయించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి తానేటి వనిత అన్నారు. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. తనకు కేటాయించిన శాఖకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని తానేటి వనిత చెప్పారు.

తనకు రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని తాను అసలు ఊహించలేదని తానేటి వనిత అన్నారు. కేబినెట్ లో రెండోసారి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం అని, సంతోషంగా ఫీల్ అవుతున్నానని మంత్రి చెప్పారు. సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తానన్నారు.(Home Minister Taneti Vanitha)

Minister Roja Thanks CM Jagan : సీఎం జగన్ చేతిని ముద్దాడిన మంత్రి రోజా

హోంశాఖ మంత్రిగా మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తానని మంత్రి తానేటి వనిత చెప్పారు. మహిళల భద్రత పట్ల సీఎం జగన్ కు ఒక విజన్ ఉందని ఆమె తెలిపారు. వారి రక్షణకు ముఖ్యమంత్రి జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని, మహిళలకు మంచి అవకాశాలు ఇస్తున్నారని మంత్రి తానేటి వనిత ప్రశంసించారు. మహిళలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందన్నారు మంత్రి వనిత. దాన్ని బలంగా నమ్మిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. మన రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం చూసినా మహిళ పేరు మీదే ఇస్తున్నారని, కేబినెట్ లోనూ మహిళలకు పెద్ద పీట వేశారని తానేటి వనిత చెప్పారు.

ఏపీలో కొత్త‌గా కొలువుదీరిన మంత్రుల‌కు శాఖలు కేటాయించారు. ఈ మేరకు ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈసారి కూడా ఐదుగరు డిప్యూటీ సీఎంలను నియమించారు. అలాగే హోంమంత్రి పదవి దళిత మహిళకు దక్కింది. డిప్యూటీ సీఎంలుగా నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, అంజాద్ బాషా, ముత్యాల నాయుడు, రాజన్న దొరకు పదవులు దక్కాయి. హోంమంత్రిగా తానేటి వనితకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్.

AP Cabinet: శాఖలు ఖరారు.. ఐదుగురికి డిప్యూటీ సీఎంగా చాన్స్.. హోం మంత్రిగా తానేటి వనిత..!

మంత్రులకు కేటాయించిన శాఖలు..

1. ధర్మాన ప్రసాద రావు: రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపులు

2. సీదిరి అప్పల రాజు: మత్స్య, పశుసంవర్థకశాఖ

3. బొత్స సత్యనారాయణ: విద్యా శాఖ

4. పీడిక రాజన్న దొర: గిరిజన సంక్షేమ శాఖ.

5. గుడివాడ అమర్నాథ్: పరిశ్రమలు, ఐటీ శాఖ

6. బూడి ముత్యాల నాయుడు: పంచాయతీ రాజ్ శాఖ, రూరల్ డెవలప్ మెంట్

7. దాడి శెట్టి రాజా: రోడ్లు, భవనాలు

8. పినిపె విశ్వరూప్‌: రవాణా శాఖ

9. చెల్లుబోయిన వేణు: బీసీ సంక్షేమం, సమాచారం, సినిమాటోగ్రఫీ

10. తానేటి వనిత: హోం శాఖ , విపత్తుల నిర్వహణ

11. కారుమూరి నాగేశ్వరరావు: పౌర సరఫరాల శాఖ(Home Minister Taneti Vanitha)

12. కొట్టు సత్యనారాయణ: దేవాదాయ శాఖ

13. జోగి రమేష్: గృహ నిర్మాణ శాఖ

14. మేరుగ నాగార్జున: సాంఘిక సంక్షేమ శాఖ

15. విడదల రజినీ: వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ

16. అంబటి రాంబాబు: జల వనరుల శాఖ

17. ఆదిమూలపు సురేష్: పురపాలక శాఖ

18. కాకాణి గోవర్ధన్ రెడ్డి: వ్యవసాయం, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్

19. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: విద్యుత్, అటవీ, పర్యావరణం, సైన్స్‌ అండ్ టెక్నాలజీ

20. ఆర్కే రోజా: టూరిజం , సాంస్కృతిక, యువజన సర్వీసులు

21. కె.నారాయణ స్వామి: ఎక్సైజ్ శాఖ

22. అంజాద్ బాషా: మైనార్టీ శాఖ

23. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి: ఆర్ధిక, శాసనసభావ్యవహారాలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ, వాణిజ్య పన్నులు

24. గుమ్మనూరు జయరామ్: కార్మిక శాఖ

25. ఉష శ్రీ చరణ్: స్త్రీ శిశు సంక్షేమ శాఖ