Bear : తిరుపతి అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం.. భక్తుల్లో తీవ్ర భయాందోళన

అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నడకమార్గంలోకి వచ్చిన ఎలుగుబంటి చాలా సేపు అక్కడే ఉంది. అలిపిరి నడకమార్గంలో జంతువుల సంచారంపై భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Bear Walk on Alipiri

Bear Walk Alipiri : తిరుమల నడకదారిలో పులుల సంచారం, భక్తులపై దాడి ఘటనలు మరువకముందే తాజాగా ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. తిరుపతి అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కనిపించడం కలకలంగా మారింది. నరసింహస్వామి ఆలయం దగ్గర ఫుల్ పాత్ పై ఎలుగుబంటి సంచరించింది. నడకమార్గంలోని సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటి సంచరించడాన్ని గుర్తించారు.

అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో నడకమార్గంలోకి వచ్చిన ఎలుగుబంటి చాలా సేపు అక్కడే ఉంది. అలిపిరి నడకమార్గంలో జంతువుల సంచారంపై భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదివుండగా తిరుమలలో మరో చిరుత చిక్కింది. తిరుమల నడకదారిలో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది.

Leopard Trapped: తిరుమలలో చిక్కిన మరో చిరుత.. చిన్నారి లక్షితపై దాడిచేసిన ప్రాంతంలో బోనులో చిక్కిన చిరుత

చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత బోన్ లో చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలో చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు తిరుమల నడకదారిలో బోనులో చిక్కిన చిరుతల సంఖ్య ఆరుకు చేరింది. కాగా, ఇవాళ చిక్కిన చిరుతను జూపార్క్ కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వరుసగా చిరుతలు బోనులో చిక్కుతుండటంతో తిరుమల కొండపైకి నడకమార్గంలో వెళ్లే భక్తులు
భక్తులు ఊపరి పీల్చుకున్నారు. కానీ, నడకమార్గంలో ఎలుగుబంటి సంచరించడం మరోసారి కలకలం రేపతుంది. దీంతో ఎలుగుబంటి, చిరుతల సంచారంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు