Happy Bhogi 2024 : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి వేడుకలు.. పాల్గొన్న రాజకీయ ప్రముఖులు

సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.

Bhogi 2024

Sankranti 2024 : సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు.

Also Read : Makar Sankranti 2024: భోగి పండ్ల ప్రాముఖ్యత

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ రామచంద్రాపురం నియోజకవర్గంలో భోగి వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వారి సంప్రదాయాల సంరక్షిస్తున్నటువంటి పండుగ సంక్రాంతి, భోగి అంటే మనసులో ఉన్న మలినాలను కడిగేసేటువంటిదన్నారు. దూర ప్రాంతాల్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు, బంధువులు అంతా గ్రామాలకు చేరుకొని అత్యంత సందడి వాతావరణంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని మంత్రి అన్నారు. అదేవిధంగా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక గీతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల నుంచి సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని అన్నారు. అనంతరం కౌన్సిలర్లతో అంబటి డాన్స్ వేయించారు.

Also Read : TDP-Janasena Manifesto : ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. 12 అంశాలతో ఉమ్మడి మ్యానిఫెస్టో రెడీ..!

తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు విష్ణు పాల్గొన్నారు. మరోవైపు నగరిలోని తన నివాసం వద్ద మంత్రి రోజా భోగి సంబరాల్లో పాల్గొన్నారు. భర్త సెల్వమణితో కలిసి భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. నాన్ లోకల్ నాయకులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇక్కడకు వచ్చి ఏదో చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. మా పార్టీని భోగిమంటల్లో తగుల పెడతామని టీడీపీ నేతలు అంటున్నారు. 2019లోనే మిమ్మల్ని తగులు పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే చేస్తారు.. జగనన్న వన్స్ మోర్ అంటూ ఏపీ ప్రజలంతా నినాదాలు చేస్తున్నారని రోజా అన్నారు.