TDP-Janasena Manifesto : ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. 12 అంశాలతో ఉమ్మడి మ్యానిఫెస్టో రెడీ..!

TDP And Janasena Combined Manifesto : టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముక వ్యూహం అంశాలతో ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించారు. ఈ నెలలోనే మ్యానిఫెస్టోను విడుదల చేయాలని సమావేశంలో జనసేన-టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

TDP-Janasena Manifesto : ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. 12 అంశాలతో ఉమ్మడి మ్యానిఫెస్టో రెడీ..!

TDP And Janasena Combined Manifesto to be released soon

Updated On : January 14, 2024 / 1:04 AM IST

TDP And Janasena Combined Manifesto : టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. శనివారం ఇక్కడ ఉండవల్లి నివాసంలో దాదాపు మూడు గంటల పాటు భేటీ కొనసాగింది. సంక్రాంతి సందర్భంగా పవన్‌ను తన ఇంటికి చంద్రబాబు భోజనానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలో చంద్రబాబుతో పవన్, లోకేశ్, నాదెండ్ల్ మనోహర్ భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన భేటీలో అనేక అంశాలపై చర్చించారు.

Read Also : JanaSena-TDP: ఈ సీట్లపైనే పీటముడి.. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన నేతలు వీరే..

12 అంశాలతో మ్యానిఫెస్టో ఫైనల్ చేసిన చంద్రబాబు : 
మొత్తం 12 ప్రధాన అంశాలతో మ్యానిఫెస్టోను చంద్రబాబు ఫైనల్ చేశారు. టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముక వ్యూహం అంశాలతో ఉమ్మడి మ్యానిఫేస్టోను రూపొందించారు. ఈ నెలలోనే మ్యానిఫెస్టోను విడుదల చేయాలని సమావేశంలో జనసేన-టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొదటిసారిగా పవన్ ఉండవల్లి నివాసానికి వచ్చిన నేపథ్యంలో ప్రధానంగా టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిసింది.

ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల తేదీపై త్వరలో స్పష్టత :
ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన, తదితర అంశాలపై చర్చించారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే లక్ష్యంతో ఉమ్మడి మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారు. ప్రధానంగా 12 అంశాలతో మ్యానిఫెస్టోను చంద్రబాబు, పవన్ కలిసి ఫైనల్ చేశారు. ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల తేదీ, స్థలంపై త్వరలో స్పష్టత రానుంది.

టీడీపీ, జనసేన పార్టీల్లో నేతల చేరికలు, వారికి సీట్ల కేటాయింపుపైన చర్చించిన్నట్టు సమాచారం. జనసేన ప్రతిపాదించే సీట్ల జాబితాను  ఉంచిన పవన్.. అభ్యర్థుల పేర్లు, ఆయా నియోజకవర్గాల్లో వారికి ఉన్న బలబలాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.

బీజేపీ పాత్రపై కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులో బీజేపీ కూడా కలిసి వస్తానంటే ఎలాంటి అంశాలను పరిష్కరించే ఆలోచన చేయాలని కూడా చర్చించినట్టు తెలిసింది. ప్రధానంగా సమావేశంలో సీట్ల సర్దుబాటుపైనే చర్చ జరిగినట్టు తెలిసింది.

జనసేన పలు ప్రతిపాదనలను మ్యానిఫెస్టోలో చేర్చనున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మ్యానిఫెస్టోను ఎక్కడ విడుదల చేయాలి? ఒక బహిరంగ సభలో విడుదల చేస్తే బాగుంటుందా? అనేదానిపై కూడా చర్చించినట్టు తెలిసింది. సీట్ల విషయంలో కీలకమైన చర్చ జరిగినట్టు తెలిసింది.

Read Also : BJP: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఎన్ని సీట్లో తెలుసా? ఏయే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయ్?