AP RERA Big Alert: ఏపీలో ప్లాట్లు, అపార్ట్ మెంట్లు కొనాలనుకునే వారికి ముఖ్య గమనిక. ఏపీ రెరాలో రిజిస్టర్ కాని ప్లాట్లు, అపార్ట్ మెంట్లు కొనుగోలు చేయవద్దని APRERA ఛైర్ పర్సన్ సురేశ్ కుమార్ చెప్పారు. ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదు చేసుకోకుండా కస్టమర్ల వద్ద డిపాజిట్లు తీసుకోవడం చట్ట విరుద్ధమని ఆయన చెప్పారు. ప్రీ లాంచ్ పేరుతో కొనుగోలుదారుల నుంచి కొంతమంది డెవలపర్లు, ప్రమోటర్లు, బిల్డర్లు డిపాజిట్లు సేకరించినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రెరా ఆమోదం పొందక ముందే డిపాజిట్లు సేకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.
బిల్డర్స్, ప్రమోటర్స్, డెవలపర్లు ఎలాంటి మార్కెటింగ్, బుకింగ్స్ వంటివి చేయకూడదని, ఎలాంటి ప్రకటనలూ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులలో జాప్యాలు, నిర్మాణ నాణ్యత సమస్యలపై కొనుగోలుదారులు రెరాను సంప్రదించవచ్చని ఏపీ రెరా ఛైర్ పర్సన్ సురేశ్ కుమార్ తెలిపారు.