Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌కు హైకోర్టులో ఊరట

Amara Raja Batteries: అమరరాజా బ్యాటరీస్‌కు హైకోర్టులో ఊరట

Amara Raja Batteries

Updated On : May 6, 2021 / 1:47 PM IST

Amara Raja Batteries: అమరరాజా కంపెనీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలను సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు.. పరిశ్రమను మూసివేయాలని పీసీబీ ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చింది హైకోర్టు.

కంపెనీ మూసివేతకు సంబంధించి అమరరాజా కంపెనీ హైకోర్టులో సవాల్ చేయగా.. కంపెనీకి అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది కోర్టు.

టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌కు సంబంధించిన‌ అమరరాజా సంస్థల కాలుష్య నిబంధనలు పాటించలేదంటూ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఇవ్వగా.. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను తోసిపుచ్చింది.

ఈ ఏడాది జూన్ 17వ తేదీ లోగా.. పీసీబీ సూచనలను అమలు చేయాలని హైకోర్టు కంపెనీకి సూచించింది.

విద్యుత్‌ను పునరుద్దరించాలని స్పష్టం చేసింది. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు మ‌రోసారి ప‌రిశీలించాల‌ని, క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి నివేదిక ఇవ్వాల‌ని వెల్లడించింది. తదుపరి విచారణను జూన్‌ 28కి వాయిదా వేసింది.