మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్‌లకు బిగ్ షాక్..! విచారణకు సీఐడీ ఆదేశం

ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ వెంటనే విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు.

మాజీ మంత్రులు రోజా, కృష్ణదాస్‌లకు బిగ్ షాక్..! విచారణకు సీఐడీ ఆదేశం

Ex Minister Roja : మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్ లపై విచారణకు ఆదేశించింది సీఐడీ. విచారణ జరపాలంటూ ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు సీఐడీ ఏడీజీ. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు రోజా, కృష్ణదాస్ లపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కబడ్డీ నేషనల్ మాజీ ప్లేయర్ ఆర్వీ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి రోజాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన సీఐడీ.. వెంటనే విచారణ జరపాలని ఎన్టీఆర్ జిల్లా సీపీని ఆదేశించారు.

Also Read : చంద్రబాబా మజాకా..! టీడీపీ కంచుకోటలో వైసీపీ కథ కంచికేనా? దారుణంగా దెబ్బతీసిన వైనాట్‌ 175..!