TDP : టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, పార్టీకి వైరస్ పట్టుకుందని కంటతడి

తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు న్యాయం జరగదు. తెలుగుదేశం పార్టీ వెంట ఇక మైనార్టీలు ఎవరూ ఉండరు. Anantapuramu TDP

TDP : టీడీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా, పార్టీకి వైరస్ పట్టుకుందని కంటతడి

Anantapuramu TDP

Updated On : July 31, 2023 / 5:54 PM IST

Anantapuramu TDP : అనంతపురము జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నగరంలో మైనారిటీ విభాగం రాష్ట్ర సదస్సు జరుగుతుండగానే కీలక నేత పార్టీకి రాజీనామా చేశారు. అయూబ్ బాషా టీడీపీకి గుడ్ బై చెప్పారు. 28ఏళ్లుగా పార్టీలో ఉన్న ఆయన రిజైన్ చేశారు. కన్నీరు పెట్టుకుంటూ రాజీనామా పత్రాన్ని చూపించారు. రాజీనామా సందర్భంగా అయూబ్ బాషా సంచలన ఆరోపణలు చేశారు.

తాడిపత్రి తెలుగుదేశం పార్టీకి జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వైరస్ పట్టుకుందని అయూబ్ బాష వాపోయారు. ఆ వైరస్ జిల్లా అంతా వ్యాపిస్తోందని, అధిష్టానం ఇప్పటికైనా గుర్తించాలని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో మైనారిటీలకు న్యాయం జరగదని ఆరోపించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, టీడీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అయుబ్ బాషా పని చేశారు.

Also Read..Narayana Brother Mani React : మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య ప్రియ ఆరోపణలు.. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన భర్త మణి

‘తాడిపత్రిలో 2004 నుంచి 2014 వరకు జేసీ కుటుంబానికి ఎదురు నిలిచాం. నాతోపాటు చాలామంది నేతలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టించారు. 2014లో పార్టీలోకి వస్తే పాతవన్నీ మరిచిపోయి సహకరించాం. కానీ ఆ కృతజ్ఞత కూడా లేకుండా మమ్మల్ని అణిచివేస్తున్నారు. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అసలు లేదు. అక్కడ జేసీ పార్టీ మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీ వెంట ఇక మైనార్టీలు ఎవరూ ఉండరు’ అని అయూబ్ బాషా అన్నారు.

Also Read.. Chandrababu Naidu: ఏపీలోని ప్రాజెక్టులను సందర్శించనున్న చంద్రబాబు.. రూట్ మ్యాప్ ఇదే