Daggubati Purandheswari : పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రియాక్షన్ ..

చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పుపట్టింది. అరెస్టును ఖండిస్తున్నామని మేము ముందుగా ప్రకటన చేశామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు.

Purandeswari and Pawan Kalyan

Purandheswari and Pawan Kalyan: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్టు తీరుపై ఆ పార్టీ నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌సైతం తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అంతేకాక, జైల్లో చంద్రబాబుతో లోకేశ్, బాలకృష్ణతో కలిసివెళ్లి పవన్ ములాఖత్ అయ్యారు. ఆ తరువాత జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటికే జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. అయితే, టీడీపీ, జనసేన కలిసిపనిచేస్తాయన్న పవన్.. బీజేపీకూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.

Ram Gopal Varma: చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఇలా సాగింది..! చం(ద)మామ కథ అంటూ రాంగోపాల్ వర్మ మరో ట్వీట్ ..

చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. కేంద్ర పెద్దల అండదండలతోనే చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారని పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా తప్పుబడుతున్న పవన్ కల్యాణ్ రానున్న కాలంలో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకొనే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పవన్ వ్యాఖ్యలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

Maganti Babu : టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను మేము తప్పుగా చూడటం లేదని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. మా అధిష్టానానికి అన్నీ వివరిస్తామని పవన్ చెప్పారని, జనసేన పార్టీ బీజేపీతో పొత్తుతోనే ఉందని అన్నారు. మా పార్టీ పెద్దలు దృష్టికి ఇక్కడ పరిస్థితులు పవన్ తీసుకెళ్తామన్నారు. మా కేంద్ర పెద్దలు మాతో చర్చ చేసిన సమయంలో మేము మా అభిప్రాయాలు చెబుతామని పురంధేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీనే తొలుత తప్పుపట్టిందని అన్నారు. అరెస్టును ఖండిస్తున్నామని మేము ముందుగా ప్రకటన చేశామని గుర్తు చేశారు. సీఐడీ ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని పురంధేశ్వరి అన్నారు. ఏపీ, తెలంగాణ బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టును ఖండించారని ఆమె గుర్తు చేశారు.

ట్రెండింగ్ వార్తలు