ఏపీకి 4, తెలంగాణకు 2 పదవులు..? కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు

ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.

Union Cabinet : కేంద్ర మంత్రివర్గ కూర్పుపై బీజేపీ కసరత్తు కొనసాగుతోంది. మంత్రివర్గ కూర్పుపైన అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ దృష్టి సారించారు. కేంద్ర క్యాబినెట్ లో ఎన్డీయే పక్షాలకు ఎన్ని పదవులు ఇస్తారు అనే దానిపై స్పష్టత రానుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో అరడజను మందికిపైగా అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. ఏపీకి 3 నుంచి 4, తెలంగాణకు 2 కేబినెట్ పదవులు రానున్నట్లు సమాచారం. ఏపీలో టీడీపీ 3, బీజేపీ లేదా జనసేనకు ఒక్క మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది.

ఇటు తెలంగాణలో ఇద్దరికి మంత్రులుగా అవకాశం కల్పించనుంది బీజేపీ. సామాజిక సమీకరణాల ఆధారంగా కేబినెట్ లో స్థానం పొందనున్నారు నేతలు. తెలంగాణ నుంచి మంత్రివర్గం రేసులో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఇక ఏపీ నుంచి మంత్రివర్గం రేసులో శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు, అమలాపురం ఎంపీ హరీశ్ మాధుర్, కృష్ణప్రసాద్, భరత్, పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బైరెడ్డి శబరి ఉన్నారు.

Also Read : కేంద్ర క్యాబినెట్‌లో ఈ శాఖలు తీసుకుంటే ఏపీకి తిరుగుండదు..! – చంద్రబాబు, పవన్‌కు జేడీ లక్ష్మీనారాయణ కీలక సూచన