Vishnukumar Raju
Vishnu Kumar Raju: స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ ఫైర్ అయ్యారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న కర్మాగారానికి ఊపిరిపోసేలా రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆర్థిక ప్యాకేజీ తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రకటించింది. కేంద్రం ప్యాకేజీ పై కూటమి నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు.
Also Read: Mahipal Reddy: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు.. ఏమైందో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ, కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఆదుకుంటున్నారని, శాశ్వత పరిష్కారంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ఇచ్చిందని అన్నారు. ఇదేక్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీపై కార్మికుల ఆశకు అంతు ఉండాలి.. అర్థంపర్ధం లేకుండా కొందరు యూనియన్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారు. కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడటం సరికాదు. మీకు ఇష్టమైతే ఉండండి లేదా రాజీనామా చేసి వెళ్లిపోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉంటే.. నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి.. దీనిపై మీరేమంటారు అని ప్రశ్నించగా.. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది.. ఎవరి అభిప్రాయాలు వారివి అంటూ విష్ణు కుమార్ రాజు అన్నారు. బెట్టింగ్ వ్యవహారంలో ఎంతటి వారు ఉన్నా అరెస్టు చేయాలని పేర్కొన్నారు.