Mahipal Reddy: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు.. ఏమైందో తెలుసా?

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు.

Mahipal Reddy: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు.. ఏమైందో తెలుసా?

MLA Mahipal Reddy

Updated On : January 21, 2025 / 2:49 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి సొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఐడీఏ బొల్లారంలో గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్‌ నాయకులు అడ్డుకున్నారు.

బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి గూడెం మహిపాల్ రెడ్డి వచ్చారు. అయితే, అక్కడి శిలాఫలకంపై కొంతమంది పేర్లు లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు.

బొల్లారం కాంగ్రెస్‌లో మొదటి నుంచి వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన వ్యతిరేక వర్గం అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మహిపాల్‌ రెడ్డి కార్యక్రమాన్ని కొందరు నాయకులు బై కాట్ చేశారు.

చివరకు ఆ కార్యక్రమం నుంచి మహిపాల్‌ రెడ్డి అసహనంతో వెళ్లిపోయారు. కాగా, గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలుపొందిన మహిపాల్‌ రెడ్డి గత ఏడాది జులైలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Donald Trump: అందరిముందు కత్తి పట్టుకుని డొనాల్డ్ ట్రంప్‌ కిరాక్ డ్యాన్స్‌.. వీడియో చూస్తారా?