Donald Trump: అందరిముందు కత్తి పట్టుకుని డొనాల్డ్ ట్రంప్‌ కిరాక్ డ్యాన్స్‌.. వీడియో చూస్తారా?

డొనాల్డ్ ట్రంప్‌ భార్య మెనాలియా ట్రంప్‌ కూడా పాదాలు కదుపుతూ స్టెప్పులు వేశారు.

Donald Trump: అందరిముందు కత్తి పట్టుకుని డొనాల్డ్ ట్రంప్‌ కిరాక్ డ్యాన్స్‌.. వీడియో చూస్తారా?

Donald Trump Dance

Updated On : January 21, 2025 / 2:01 PM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఒక్కసారిగా మిలటరీ కత్తి పట్టుకుని డ్యాన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. అధికారిక కార్యక్రమంలో ట్రంప్‌ అలా ప్రవర్తించడంతో సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అవాక్కయ్యారు.

కమాండర్ ఇన్ చీఫ్ బాల్ వద్ద కేక్ కటింగ్ వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. వేడుక ప్రారంభోత్సవంలో కేక్‌ కట్‌ చేసే సమయంలో ట్రంప్‌కు కత్తిని అందించడంతో ఆ సమయంలో ట్రంప్‌ ఇలా ప్రవర్తించారు.

డొనాల్డ్ ట్రంప్‌ భార్య మెనాలియా ట్రంప్‌ కూడా పాదాలు కదుపుతూ స్టెప్పులు వేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ కూడా ఆ సమయంలో వేదికపైనే ఉన్నారు. అంతకుముందు కమాండర్ ఇన్ చీఫ్ బాల్ వద్ద ట్రంప్, మెనాలియాకు అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్‌ టక్సేడో ధరించి రాగా, మెనాలియా ట్రంప్ వైట్‌ కలర్ స్లీవ్‌లెస్, బ్లాక్ కలర్ జిగ్ జాగ్ డ్రెస్సులో ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం.. భార‌త్‌కు ఇబ్బందులు తప్పవా?