GVL Narasimha Rao : వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆశీర్వదించండి

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకం జలజీవన్ మిషన్ ను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. 2024 కల్లా ఇంటింటికి మంచి నీరు అందించడంపై

GVL Narasimha Rao : బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకం జలజీవన్ మిషన్ ను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవడం లేదన్నారు. 2024 కల్లా ఇంటింటికి మంచి నీరు అందించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ఇది అని, అన్ని రాష్ట్రాలకు అవసరమైనదని చెప్పారు. ఏపీలో అనేక జిల్లాల్లో నీటి ఇబ్బందులు ఉన్నాయని ఎంపీ చెప్పారు. కేంద్రం రూ.3వేల 183 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదన్నారు. మార్చి చివరి నాటికి ఇవ్వకపోతే కేంద్ర వాటా కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు.

Body Ageing: ఇవి తింటున్నారా.. ముసలితనం ముందే రావడం ఖాయం

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర నిధులు వినియోగించుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో ప్రజలకు నీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం నిధులు ఎందుకు వాడుకోవడం లోదో సీఎం జగన్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల పేరుతో ప్రజల నుంచి ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తోందన్నారు. వన్ టైం సెటిల్ మెంట్ కింద వేలాది కోట్ల రూపాయలు సేకరించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి వసూల్ రాజాలా మారాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

Liver : లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు చిట్కాలు

ప్రజలపై భారం మోపే కార్యక్రమాలు ఉపసంహరించుకోవాలన్నారు. ఓటీఎస్ వసూళ్లు ఆపాలన్నారు. గత ప్రభుత్వం కూడా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వాల్సిన ఇళ్లను నిర్మించడం చేత కాలేదన్నారు. 365 గజాల ఇళ్లకు 7.55 లక్షలని చెప్పి కేంద్ర వాటా లక్షన్నర మినహాయించి ప్రజల పై రుణభారం మోపారని జీవీఎల్ చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని తమ అభివృద్దిగా చెప్పుకుంటూ వైసీపీ, టీడీపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని జీవీఎల్ ధ్వజమెత్తారు. వైసీపీ, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని జీవీఎల్ కోరారు.

ట్రెండింగ్ వార్తలు