Black Fungus : ఫంగస్ పరేషాన్ .. బ్లాక్ ఫంగస్ తో వణికిపోతున్న ప్రజలు

కరోనానే అనుకుంటే.. దానికంటే ఎక్కువ భయపెట్టేస్తోంది బ్లాక్‌ ఫంగస్‌. ఓ వైపు వైరస్‌ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ఈ ఫంగస్‌ కబళిస్తోంది. దేశంలో ఫంగస్‌ బాధితులు పెరుగుతున్న టైమ్‌లో.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు శాస్త్రవేత్తలు.

Black Fungus Fear In Andhratelangana States

Black Fungus : కరోనానే అనుకుంటే.. దానికంటే ఎక్కువ భయపెట్టేస్తోంది బ్లాక్‌ ఫంగస్‌. ఓ వైపు వైరస్‌ బారిన పడి ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. మహమ్మారి నుంచి కోలుకున్నవారిని ఈ ఫంగస్‌ కబళిస్తోంది. దేశంలో ఫంగస్‌ బాధితులు పెరుగుతున్న టైమ్‌లో.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు శాస్త్రవేత్తలు. ఇంతకీ డాక్టర్లు చెబుతున్న న్యూస్ ఏంటి..?

భారత్‌లో బ్లాక్‌ ఫంగస్‌ కల్లోలం రేపుతోంది. కరోనా బారిన పడి కోలుకున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ మాత్రం వదలడం లేదు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెరుగుతున్న ఫంగస్‌ కేసులపై అధ్యయనం చేస్తున్న వైద్యులు.. ఇప్పుడు షాకింగ్‌ న్యూస్‌ చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందంటూ బాంబ్‌ పేల్చారు. దవడ ఎముకలు, దంతాలు, చిన్న పేగులపైనా తీవ్ర ప్రభావం చూపుతోందని తేల్చారు.

ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని.. అయితే ఆ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు డాక్టర్లు. రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటే.. బ్లాక్‌ఫంగస్‌ను సులభంగా ఎదుర్కోవచ్చని చెప్పారు. సకాలంలో చికిత్స తీసుకుంటే.. వ్యాధిని నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. ముక్కు, సైనస్‌, నాడీవ్యవస్థ, ఊపిరితిత్తులు, చర్మం, కీళ్లు, గుండె, మూత్రపిండాలపై మాత్రమే కాకుండా పేగులు, దవడ ఎముకలపైనా ప్రభావం చూపుతోందీ బ్లాక్‌ ఫంగస్‌.

తక్కువ ఆక్సిజన్‌ స్థాయి, రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి ఎక్కువగా ఉండి తెల్ల రక్తకణాల సంఖ్య తక్కువ ఉన్నవారిలో బ్లాక్‌ ఫంగస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. అరుదుగా వచ్చే ఈ ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదకరమైందన్నారు డాక్టర్లు. దేశవ్యాప్తంగా 8 వేల 800 బ్లాక్‌ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అయితే.. ఈ వ్యాధి సోకినవారిలో 79 శాతం మంది పురుషులే ఉన్నారు. ఫంగస్‌ సోకిన వందమందిలో 83 మంది షుగర్‌ వ్యాధిగ్రస్తులేనని తేలింది. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

కరోనా నుంచి కోలుకున్న డయాబెటిక్‌ పేషెంట్లు మరింత అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచించారు. కరోనా పూర్తిగా తగ్గక ముందే శరీరం ఈ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుండగా, కొవిడ్‌ తగ్గాకనే వ్యాధి బయటపడుతుందన్నారు. ఈ పరిశోధనలో భారత్‌తో సహా అమెరికా, ఇరాన్‌లో బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డ రోగులను పరిశీలించారు.