అప్పులు 2.25లక్షల కోట్లు.. 7 జిల్లాలు వెనుకబడ్డాయి : బోస్టన్ కమిటీ నివేదికలోని వివరాలు ఇవే
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. కమిటీ

రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వివరించారు. కమిటీ
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జగన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోని వివరాలను ప్రణాళికా విభాగం కార్యదర్శి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. బోస్టన్ కమిటీ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిందని తెలిపారు. అభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలను నివేదికలో సూచించిందన్నారు. 13 జిల్లాలను 6 రీజియన్లుగా బోస్టన్ గ్రూప్ పరిశీలించిందన్నారు. రాష్ట్రంలోని 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. ఏపీకి 2.25లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు.
బోస్టన్ గ్రూప్ కమిటీ నివేదికలోని వివరాలు:
* బోస్టన్ కమిటీ ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించింది
* అభివృద్ధికి చేపట్టాల్సిన విధానాలు నివేదికలో సూచించింది
* 6 అంశాల ఆధారంగా బోస్టన్ కమిటీ నివేదిక
* 13 జిల్లాలను 6 రీజియన్లుగా బోస్టన్ గ్రూప్ పరిశీలించింది
* ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైన వనరులు ఉన్నాయో పరిశీలించింది
* 13 జిల్లాల్లో 7 జిల్లాలు వెనుకబడి ఉన్నాయి
* ఏపీకి 2.25లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి
* అక్షరాస్యత విషయంలో రాష్ట్రం వెనుకబడి ఉంది
* కర్నూలు, కడప జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ది చాలా తక్కువగా ఉంది
* కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలు తప్ప మిగతా ప్రాంతాల్లో సాగు తక్కువ
* పర్యాటకం విషయంలోనూ చాలా తక్కువ పురోగతి
* రాయలసీమలో 20శాతం మాత్రమే వ్యవసాయ ఉత్పత్తి
* రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది
* 8 జిల్లాల్లో పారిశ్రామిక వనరులు లేవు
* దక్షిణాదిలోనే ఏపీలో తక్కువ తలసరి ఆదాయం
* ఉత్తరాంధ్రను మెడికల్ హబ్ గా తయారు చేయొచ్చు
* చెన్నై నుంచి విశాఖ వరకున్న రైలు మార్గాన్ని ఆధునికీకరణ చేయాలని బీసీజీ సూచన
* ఉత్తరాంధ్రలో కాఫీ, జీడి పంటలు పెంచుకోవచ్చు
* అక్షరాస్యతలో జాతీయ సగటు కన్నా ఏపీలో తక్కువ
* రాష్ట్రంలో ప్రకృతి సంపదను సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం
* ప్రకృతి సంపద వినియోగంపై ప్రభుత్వానికి కీలక సూచనలు
* మౌలిక సదుపాయాలు, రోడ్డు రవాణా వ్యవస్థలను మరింత అభివృద్ది చేయాల్సిన అవసరముంది
* సమతుల్యత, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా నివేదికలో సూచనలు
Also Read : విశాఖ బెస్ట్ : రాజధానిపై బోస్టన్ గ్రూప్ రెండు ఆప్షన్లు