AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి.. కృష్ణా ఫస్ట్, విజయనగరం లాస్ట్

AP Inter Results 2023 : ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రిజల్ట్స్ లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం దక్కింది.

AP Inter Results 2023 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం సాయంత్రం 6.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటలకు రిజల్ట్స్ విడుదల కావాల్సి ఉంది. అయితే గంటన్నర ఆలస్యంగా ఫలితాలు వచ్చాయి.

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. మొదటి, రెండో సంత్సర ఫలితాలలో అమ్మాయిలు సత్తా చాటారు. ఇంటర్ సెకండియర్ లో 75శాతంతో గర్ల్స్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. బాలురు 68శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ లో 65శాతం ఉత్తీర్ణతతో గర్ల్స్ టాప్ లో ఉన్నారు. బాలురు 58శాతం పాస్ అయ్యారు.

ఇంటర్ ఫస్టియర్ లో 61శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సెకండియర్ లో 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రిజల్ట్స్ లో కృష్ణా జిల్లాకు మొదటి స్థానం దక్కింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 83శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయనగరం జిల్లాకు ఆఖరి స్థానం దక్కింది. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 57శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఫస్టియర్ పరీక్షలకు 4లక్షల 33వేల 275మంది విద్యార్థులు హాజరవగా.. 2లక్షల 66వేల 326 మంది పాస్ అయ్యారు. సెకండియర్ పరీక్షలకు 3లక్షల 79వేల 758 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2లక్షల 72వేల 001 మంది పాస్ అయ్యారు.

https://examresults.ap.nic.in
www.bie.ap.gov.in వెబ్ సైట్స్ లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.

కాగా, పరీక్షలు ముగిసిన 22 రోజుల్లో ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలు వెల్లడించడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు