Botsa Satyanarayana
రామతీర్థం రాముడి విగ్రహం ధ్వంసం కేసులో ఏ2గా ఉన్న నిందితుడికి ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.5 లక్షలు ఎలా ఇస్తారని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సాక్షాత్తూ దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా చెక్ అందించారని చెప్పారు.
ముద్దాయి అమాయకుడు, నిరపరాది అనుకుంటే కేసును వెనక్కి తీసుకోవాలని బొత్స సత్యనారాయణ అన్నారు. లేకుంటే అక్రమ కేసులు పెట్టిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను ప్రోత్సహించిన అప్పటి ప్రభుత్వ నేతలపై అయినా చర్యలు తీసుకోండని అన్నారు.
అవేమీ లేకుండా ప్రజాధనాన్ని ఒక ముద్దాయికి ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటో చెప్పాలని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇలాంటి వాటిని ప్రభుత్వం ప్రోత్సహించడం వెనుక సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలచుకున్నారని నిలదీశారు.
రాజకీయంగా ఆదుకోవాలనుకుంటే.. పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలని బొత్స సత్యనారాయణ అన్నారు. ఎరువుల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కానీ, ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. సంక్రాంతి పండగ పేరుతో, కోడి పందాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.
KTR: ఇక నుంచి తెలంగాణ భవన్.. తెలంగాణ జనతా గ్యారేజ్: కేటీఆర్